విజయవాడ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయనున్న కేశినేని శ్వేత - AP political news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 1:29 PM IST
Kesineni Swetha Resign From Vijayawada Corporator Post: విజయవాడ కార్పొరేటర్ పదవికి తన కుమార్తె కేశినేని శ్వేత నేడు రాజీనామా చేయనున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విటర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు. ''అందరికీ నమస్కారం. ఈరోజు నా కుమార్తె శ్వేతా 10.30 గంటలకు మున్సిపల్ ఆఫీసుకి వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి, ఆమోదింప చేయించుకొనున్నారు. ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తుంది.'' అని ఎంపీ కేశినేని నాని వెల్లడించారు.
MP Kesineni Nani Tweet on Resign: మరోవైపు తెలుగుదేశం పార్టీకి తాను కూడా త్వరలోనే రాజీనామా చేయబోతున్నామని తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన శనివారం ట్విటర్ (ఎక్స్) వేదికగా ''అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదని అధినేత చంద్రబాబు నాయుడు భావించారు. ఇలాంటి సమయంలో నేను ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన. కాబట్టి త్వరలోనే దిల్లీ వెళ్లి, లోక్‌సభ స్పీకర్‌ను కలిసి నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. అది ఆమోదం పొందిన మరుక్షణమే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా.'' అని కేశినేని నాని పేర్కొన్నారు.