కార్తిక పౌర్ణమి వేళ రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ - karthika pournami Festival in AP
🎬 Watch Now: Feature Video
karthika pournami celebrations: కార్తిక పౌర్ణమి వేళ రాష్ట్రంలోని అన్ని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. హరహర మహాదేవ, శంభో శంకరా అంటూ భక్త జనం.. స్వామి దర్శనానికి పోటెత్తారు. జ్యోతి స్వరూపుడైన ఓంకారేశ్వరుడుకి ప్రణమిల్లి.. కార్తిక దీపాలతో పూజలు చేశారు. జ్వాలతోరణాలతో ఆ పరమేశ్వరుడిని ఆరాధించారు. సోమవారం, కార్తిక పౌర్ణమి కలిసి రావడంతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఊరు,వాడ అనే తేడా లేకుండా శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST