Karanam Venkatesh Fire Amanchi చీరాలలో ప్రశాంతతను చెడగొడితే ఊరుకునేది లేదు.. 2024లో నేనే పోటీ చేస్తా! - ఏపీ రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 7:05 PM IST
|Updated : Sep 2, 2023, 10:40 PM IST
Karanam Venkatesh Fire Amanchi బాపట్ల జిల్లా చీరాల వైసీపీ ఇంచార్జ్ వెంకటేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడిన తీరు చూస్తే పరోక్షంగా ఆమంచి సోదరులపై విమర్శల వర్షం కురిపించినట్లుగా అనిపించింది. పక్క పార్టీలో ఉంటూ తమపై విమర్శలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. చీరాల నియోజకవర్గంలో నిర్వహించిన దివంగత నేత వైఎస్ వర్థంతి కార్యక్రమంలో ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు.
తన తండ్రి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ది రెండు కళ్లలాగా సాగుతోందని అన్నారు. చీరాల నియోజకవర్గం ప్రశాంత వాతావరణంలో ఉండగా.. అభివృద్ధిని చూసి ఓర్వలేని పక్క నియోజకవర్గ ఇంచార్జీ.. పక్క పార్టీలో చేరిన స్థానిక నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెంపలు పగలగొడతామని మండిపడ్డారు. నోరుజారి మాట్లాడితే అంతు తేలుస్తామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎక్కడో ఉండి మాట్లాడటం కాదు.. దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలంటూ సవాల్ విసిరారు.
TAGGED:
బాపట్ల వైసీపీ వార్తలు