పల్నాటి ఉత్సవాల్లో కారంపూడి ఎస్సై వీరంగం - మహిళలు, వృద్ధులపై దాడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 3:18 PM IST
Karampudi SI Veerangam in Palnati Festivals: తిరునాళ్లలో పొట్టకూటి కోసం వచ్చిన వారిపై ఓ ఎస్సై జులుం ప్రదర్శించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పల్నాటి ఉత్సవాల్లో కారంపూడి ఎస్సైకి సంబంధించిన కొంతమంది యువకులు రంగులరాట్నం ఫ్రీగా తిప్పమని అడగడంతో వివాదం మొదలైంది. ఆగ్రహించిన ఎస్సై వారిని కొట్టడంతో యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఎస్సై వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన ఓ వృద్ధుడు పోలీసు వాహనాన్ని అడ్డుకోగా, ఎస్సై ఆ వృద్ధుడి ఛాతిపై తన్నాడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
అసలు ఏం జరిగిందంటే: పల్నాడు జిల్లా కారంపూడిలో పల్నాటి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తిరునాళ్లలో మహారాష్ట్ర నుంచి పొట్టకూటి కోసం వచ్చిన కొంతమంది వ్యక్తులు రంగులరాట్నాలు పెట్టుకున్నారు. కారంపూడి ఎస్సైకి సంబంధించిన కొంతమంది యువకులు వచ్చి, రంగులరాట్నం ఫ్రీగా తిప్పమని అడిగారు. దానికి వారు జనరేటర్ ఆపడంతో తిప్పమని చెప్పారు. ఆగ్రహించిన ఎస్సై వారిని కొట్టారు. దీంతో మహారాష్ట్ర యువకులు, మహిళలు ఎస్సై వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీస్ వాహనాన్నే ఆపుతారా అంటూ ఎస్సై మహిళలపై దౌర్జన్యానికి దిగారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఓ వృద్ధుడు అడ్డుకోగా, ఎస్సై అతని ఛాతిపై తన్నాడంతో వృద్ధుడు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వృద్ధుడికి ఏమన్నా జరిగితే, పూర్తి బాధ్యత ఎస్సై వహించాలని బాధితులు ధర్నాకు దిగారు.