టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అరెస్ట్‌పై ఆరోపణలు అవాస్తవం: ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ - BTech Ravi Arrest UPDATES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 10:43 PM IST
Kadapa SP Siddhartha Kaushal on BTech Ravi Arrest: కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న టీడీపీ నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అరెస్ట్ విషయంలో ఓ సీనియర్ రాజకీయ నేత పోలీసులపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని.. కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. ప్రధానంగా సీఐ అశోక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. బీటెక్ రవిని కిడ్నాప్ చేశారనటంలో వాస్తవం లేదన్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన ఆరోపణలపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గురువారం మీడియాతో మాట్లాడారు.
SP Siddhartha Kaushal Comments: ''కడప జైళ్లో ఉన్న బీటెక్ రవిని పరామర్శించిన సమయంలో ఓ సీనియర్ రాజకీయ నేత పోలీసులపై పలు ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదు. పది నెలల క్రితం తోపులాటలో ఓ పోలీసు అధికారిని గాయపరిచిన కారణంతోనే బీటెక్ రవిని వల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. బీటెక్ రవిని పోలీసులు కిడ్నాప్ చేసి, చంపడానికి ప్రయత్నం చేశారని అనటం కరెక్ట్ కాదు. ఈ నెల 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు బీటెక్ రవిని అరెస్ట్ చేసి.. మూడు గంటల్లోనే వైద్య పరీక్షలు పూర్తి చేశాం. ఆ వెంటనే మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, జైలుకు తరలించాం. బీటెక్ రవిని అరెస్ట్ చేసి, నిర్భంధించారనే విషయాలను మెజిస్ట్రేట్ ముందుకు ఆయన ఎందుకు చెప్పలేదు..? విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిని టార్గెట్ చేసి ఆరోపణలు చేయడం సరైన చర్య కాదు. బీటెక్ రవి మొబైల్‌లోని డేటాను డౌన్‌లోడ్ చేసుకున్నారనే విషయం కూడా వాస్తవం కాదు. ఆ సీనియర్ నేత ఆరోపణలపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలనే అంశంపై మేము పరిశీలిస్తున్నాం'' అని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు.