Justice PK Mishra: "నాకు ఏపీ ప్రజలు నచ్చారు.. ఇక్కడ పనిచేసిన రోజులు గుర్తుండిపోతాయి": జస్టిస్ మిశ్రా - Justice PK Mishra on Latest Speech
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-06-2023/640-480-18777902-917-18777902-1687004393939.jpg)
Justice Prashant Kumar Mishra Felicitation: ఏపీ ప్రజలు తనకు ఎంతో బాగా నచ్చారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సంతోషం వ్యక్తం చేశారు. మంగళగిరిలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదుల ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించి.. ఆయనను ఘనంగా సత్కరించారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పదోన్నతిపై ఏపీ హైకోర్టు నుంచి సుప్రీం న్యాయమూర్తిగా వెళ్లిన విషయం తెలిసిందే. జస్టిస్ ప్రశాంత్ కుమార్తో కలసి పనిచేయడం జీవితంలో మరువలేమని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని.. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి అన్నారు. జ్యుడిషియల్ అకాడమీ, న్యాయసేవా కేంద్రం, హైకోర్టులో మరో న్యాయస్థానం జస్టిస్ పీకే మిశ్రా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలోనే వచ్చాయన్నారు. తాను చత్తీస్గడ్లో పనిచేసిన దానికంటే ఏపీ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన.. జీవితమే గుర్తుండి పోతుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలిపారు. ఇక్కడి న్యాయవాదులు ఎప్పుడూ న్యాయమూర్తులతో ఘర్షణకు దిగలేదని..అంతా సానుకూల వాతావరణంలోనే కలసి పనిచేశామన్నారు.