సీఎం జగన్‌తో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ భేటీ- కడప ఉక్కు కర్మాగారంపై చర్చ - సీఎం జగన్‌తో జిందాల్‌

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 10:41 AM IST

JSW Group Chairman Sajjan Jindal Meet CM Jagan: సీఎం జగన్‌తో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ సమావేశమయ్యారు. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పురోగతి, ఇతరత్రా అంశాలపై చర్చించారు. కడప స్టీట్‌ ప్లాంట్(Kadapa Steel Plant) నిర్మాణ పనులు జనవరి నుంచి మరింత వేగవంతమవుతాయని సీఎంకు జిందాల్‌ వివరించారు. ప్రభుత్వ సహాయ సహకారాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో ఈ ప్లాంటు కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని జిందాల్‌ పేర్కొన్నారు. 

వెనుకబడ్డ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతిని పోత్సహిస్తున్నామని పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వివరించారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట సమీపంలో ఎమ్.ఎస్​.ఎమ్​.ఈ పార్కు అభివృద్ధి కోసం సిద్ధంగా ఉన్నట్లు జిందాల్‌ తెలిపారు. వచ్చే నెలలో దీని శంకుస్థాపకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సౌరవిద్యుత్‌ రంగం(Solar Power Sector)లో పెట్టుబడులు పెడతామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.