JC Prabhakar Reddy Padayatra for CBN: చంద్రబాబు విడుదల త్వరగా కావాలని.. జేసీ ప్రభాకర్ రెడ్డి పాదయాత్ర - Latest comments of JC Prabhakar Reddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2023, 4:00 PM IST

JC Prabhakar Reddy Padayatra for CBN : చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదని త్వరలో విడుదలవుతారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని తిమ్మనచెరువు లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వందలాది కార్యకర్తలతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి పాదయాత్రగా వెళ్లి దర్శనం చేసుకున్నారు.

JC Prabhakar Reddy Walked 6 Kilometers : చంద్రబాబు నాయుడిని లోపల పెట్టినంత మాత్రాన ఏమీ కాదని, ఆయన ఏ తప్పు చేయలేదని పీటీ వారెంట్లు, కేసులు అన్నీ దాటుకొని త్వరలోనే విడుదలవుతారని జేసీ చెప్పారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద కళ్యాణమండప నిర్మాణం చేస్తుంటే పోలీసులు అడ్డుపడటం తగదని, ఇంత మంది భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్న ఎస్సై ఇసుక ట్రాక్టర్ల నుంచి ఎంత వసూలు చేస్తున్నారో తన వద్ద చిట్టా ఉందంటూ ఆయన ఆరోపించారు. 

ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్న ఎస్సై నంద్యాలతో భవనం నిర్మిస్తున్నారని జేసీ ఆరోరించారు. ప్రజలందరితో కలిసి వచ్చి దేవుడిని దర్శించుకొని భోజనం చేసి వెళుతున్నామని, దీన్ని కూడా అడ్డుకోవాలని చూస్తే ఎలాగంటూ పోలీసులపై ఆయన విరుచుకుపడ్డారు. తాము గొడవలు చేసేవాళ్లం కాదని, నేడు ఇన్ని వందల మందితో వచ్చి దర్శనం చేసుకున్నామే తప్ప.. ఎలాంటి తప్పు చేయలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.