శ్రీవారి సేవలో శ్రీదేవి కుమార్తె - Janhvi
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 1:02 PM IST
Bollywood Heroine Janhvi Kapoor Visited Tirumala: బాలీవుడ్ నటి, అలనాటి అందాలతార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తిరుమల (Tirupathi) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆలయ సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తరువాత రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
జూ.ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న 'దేవర' సినిమాలో తారక్ సరసన జాన్వీ నటిస్తున్నారు. దేవర సినిమాతో జాన్వీ టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమాలో ఈమె రోల్పై ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటికే 80శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న దేవర సినిమా ఏప్రిల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే.