Janasena PAC Chairman Nadendla Manohar : చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, పనన్ కల్యాణ్ ఆలోచనలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం: నాదెండ్ల - Janasena PAC Chairman Nadendla Manohar comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 18, 2023, 4:49 PM IST
Janasena PAC Chairman Nadendla Manohar Visited Kothapet: జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయనకు పార్టీ నేతలు గజమాలలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన నాదెండ్ల మనోహర్.. వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. త్వరలోనే ఉమ్మడి ప్రణాళికతో జనసేన, టీడీపీ ఇంటింటికీ వెళ్లే కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు.
Nadendla Manohar Comments: నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ..''చంద్రబాబు నాయుడి సుదీర్ఘ అనుభవం, పవన్ కల్యాణ్ ఆలోచన ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకుని రెండు పార్టీలు ముందుకెళ్లబోతున్నాయి. వైఎస్సార్సీపీ విముక్త ఏపీ కోసం ప్రజలంతా కంకణం కట్టుకున్నారు. త్వరలోనే ఉమ్మడి ప్రణాళితో ఇంటింటికీ వెళ్లే కార్యక్రమాన్ని చేపడతాం. రెండు పార్టీల కలయిక ద్వారా రాష్ట్రంలో మెరుగైన అభివృద్ధి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాం.'' అని అన్నారు.