Janasena on YSRCP MLA వైసీపీ ఎమ్మెల్యే ప్రజల డేటాను చోరీ చేశాడు.. వెంటనే అరెస్టు చేయాలి: జనసేన నేతలు - chandragiri mla chevireddy bhaskar reddy
🎬 Watch Now: Feature Video
Janasena Leaders on Chandragiri MLA: డేటా చోరీ విషయంలో అధికార వైసీపీపై విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే డేటాని చోరీ చేశాడని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై జనసేన పార్టీ నాయకులు సంచలన ఆరోపణ చేశారు. ఏపీ ప్రభుత్వ గుర్తు, సీఎం జగన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలతో ఉన్న అధికారిక సమాచార సేకరణ పత్రాన్ని మనోహర్ మీడియా ఎదుట పెట్టారు. నియోజకవర్గంలోని మూడు లక్షల మంది వ్యక్తిగత డేటాను.. వాలంటీర్ల ద్వారా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చోరీ చేశారని.. తిరుపతి జిల్లా చంద్రగిరి జనసేన నేత దేవర మనోహర్ ఆరోపించారు. సేకరించిన డేటాను హైదరాబాద్ నానక్ రాం గూడాలోని ఓ కంపెనీ చేతిలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నుంచి ఈ డేటా సంఘ విద్రోహక శక్తుల చేతుల్లోకి వెళుతోందని మండిపడ్డారు. ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటం కాదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా ఇంత భారీ ఎత్తున డేటా చోరికి పాల్పడిన ఎమ్మెల్యే చేవిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.