ఆంధ్రా రోడ్ల గురించి కేసీఆర్‌ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రుల మౌనం ఎందుకు - గాదె వెంకటేశ్వరరావు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 6:48 PM IST

Janasena Leader Gade Venkateswara Rao Comments: ఆంధ్రప్రదేశ్​లో రహదారులపై పక్క రాష్ట్రాల వారు గేలి చేస్తున్నా.. ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు స్పందించటం లేదని గుంటూరు జిల్లా జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న సీఎం జగన్‌ ఆస్తులను ఏమైనా చేస్తారనే భయంతోనే.. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రోడ్లపై వ్యాఖ్యలు చేసినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించలేదని.. గాదె వెంకటేస్వరరావు మండిపడ్డారు. రాష్ట్రంలో విపక్షాలు చేసే వ్యాఖ్యలపై బూతులు మాట్లాడే మంత్రులు.. కేసీఆర్ వ్యాఖ్యలపై మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. కేసీఆర్ తంతారని భయపడుతున్నారా అని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. మంత్రులు అంబటి, రోజా, అమర్నాథ్, జోగి, మాజీ మంత్రులు ఎందుకు స్పందించడంలేదని అన్నారు.

Drought Conditions in AP: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క కరవు మండలం కూడా ప్రకటించకపోవడాన్ని ఇక్కడి ప్రజాప్రతినిధుల వైఫల్యంగా అభివర్ణించారు. పల్నాడు జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉండి కరవు పరిస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సాగర్ నుంచి నీళ్లివ్వలేం.. పంటలు వేయవద్దని చెప్పిన మంత్రి అంబటి.. కనీసం కరవు మండలాల జాబితాలో చేర్చలేకపోవటం ఏమిటన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.