Pavan Muslims Meeting: ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తాం: పవన్ కల్యాణ్ - pawan kalyan met news
🎬 Watch Now: Feature Video
Pawan Kalyan met with Muslim community: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ముస్లిం వర్గ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పనతో ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. ఇతర రాజకీయ నేతల మాదిరి ముస్లింలను ఓటు బ్యాంకుగా ఎప్పుడు చూడలేదన్నారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముస్లింలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం జగన్.. హిందువు కాదు కాబట్టి క్రైస్తవం స్వీకరించడం వల్ల.. ఆయన్ను నమ్మెచ్చని ముస్లింలు అనుకుంటున్నారన్నారు. నిజంగా అల్లాను ప్రార్థిస్తే.. సత్యం చెప్పేవాడు ఒకడు మీకు తప్పకుండా కనిపిస్తాడని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ ముస్లింలకు నచ్చదన్నారు. పాకిస్తాన్‌లో హిందువులను చంపేశారన్నారు.. కానీ, మన దేశంలో గౌరవించారని.. అది హిందూ సనాతన ధర్మమని ఆయన గుర్తు చేశారు.
అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాకినాడలో రోడ్ షో నిర్వహించారు. కాకినాడ నగరంలో భారీ జన సందోహం మధ్య ప్రారంభమైన రోడ్ షో.. తాళ్లరేవు, యానాం, మురమళ్ల మీదుగా సాగింది. దారి పొడవునా అభిమానులు, జనసైనికులు ఘన స్వాగతం పలకగా.. వారికి పవన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాత్రికి ముమ్మిడివరం మండలం కమాన్‌పల్లిలో పవన్ బస చేస్తారు.