Jana Sena leader Nagababu Comments: ఎక్కడి నుంచి పోటీ చేస్తారో పవన్ త్వరలోనే ప్రకటిస్తారు: నాగబాబు - ఏపీ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 10:53 PM IST

Jana Sena leader Nagababu Comments: చంద్రబాబును అరెస్టు చేయడం బాధ కలిగించిందని, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.  తిరుపతిలో నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుపైన జనసైనికులు ఆవేదనతో ఉన్నారని ఆయన తెలిపారు.  టీడీపీ-జనసేన పొత్తును జన సైనికులు స్వాగతిస్తున్నారని వెల్లడించారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో త్వరలోనే పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని తెలిపారు.  అవినీతిపరులు, అక్రమార్కులకు జనసేనలో సీట్లు ఇవ్వబోమని ఆయన పేర్కొన్నారు. జనసేన నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని.. అలాంటి కేసులకు బయపడే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రజా సేవకులకుమాత్రమే జనసేన తరపున టికెట్లు ఇస్తామని నాగబాబు వెల్లడించారు. నారా చంద్రబాబు అరెస్ట్​ కండిస్తూ తెలుగు దేశం శ్రేణులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జనసేన సైతం తొడు ఉంటుందని నాగబాబు వెల్లడించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ... రెండు పార్టీలు ఉమ్మడిగా నిరసన తెలపాలని నిర్ణయించినట్లు నాగబాబు వెల్లడించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.