Jana Jagarana Samiti on CM Jagan విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడలేనివాడు ఉత్తరాంధ్రను ఎలా ఉద్ధరిస్తాడు?: జన జాగరణ సమితి - Jana Jagarana Samiti news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 9:16 PM IST

Jana Jagarana Samiti on CM Jagan Visakha Administration: విజయదశమి తర్వాత విశాఖపట్నం నుంచే పరిపాలన ఉంటుందని.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో పేర్కొన్న అంశంపై జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కును కాపాడలేనివాడు, ఉత్తరాంధ్రను ఎలా ఉద్ధరిస్తాడని ఆగ్రహించారు. దసరా నుండి విశాఖ కేంద్రంగా పరిపాలన చేస్తూ.. ఉత్తరాంధ్రను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని ముఖ్యమంత్రి ప్రగల్బాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా ఆపాలని హితవు పలికారు.

Jagarana Samiti State Convener Comments: ముఖ్యమంత్రి జగన్ విశాఖ పరిపాలన అంశంపై జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ.. ''విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నుండి కాపాడకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది..?, అసలు విశాఖ స్టీల్‌ప్లాంట్ లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఊహించగలమా..?, ఎన్నో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంటే..ముఖ్యమంత్రి జగన్ పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా తాకట్టు పెట్టారు. నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపైనా ముఖ్యమంత్రి జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే వైసీపీ ఎంపీల అందరిచేత రాజీనామా చేయించి.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలి. లేనిపక్షంలో వైసీపీని ఉత్తరాంధ్ర ప్రజలు రానున్న ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడించి, ఉగాదికి జగన్ చేత పులివెందులలో కాపురం పెట్టిస్తారు.'' అని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.