ISRO Scientists Team Visited Tirumala and Srikalahasthi for Aditya L1 Success: తిరుమల శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం.. - ఆదిత్య ఎల్​1 ప్రయోగం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2023, 5:34 PM IST

ISRO Scientists Team Visited Tirumala and Srikalahasthi for Aditya L1 Success: తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. అంతేకాకుండా ఈ బృందం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సైతం పూజలు నిర్వహించారు. వీరికి తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బంది, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రవేత్తల బృందం స్వామివారిని దర్శించుకున్నారు. ఇస్రో పతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఆదిత్య ఎల్​1 (Aditya L1) ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని స్వామి వారిని దర్శించుకున్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు. ఈ క్రమంలో ఉపగ్రహ నమూనాను స్వామి వారి పాదాల వద్ద ఉంచి ప్రయోగం విజయవంతం కావాలని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం ముగిసిన అనంతరం ఆలయ అర్చకులు శాస్త్రవేత్తలకు తీర్థప్రసాదాలు అందించారు. శ్రీకాళహస్తిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం..  వారికి శ్రీ మేదో గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద వేద పండితులు ఆశీర్వాదాలు అందించారు.

అసలేంటి ఆదిత్య ఎల్​1..  సూర్యుడ్ని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడ్తున్న మొట్టమొదటి మిషన్​ ఆదిత్య ఎల్​1. దీనిని రేపే (శనివారం) ఇస్రో ప్రయోగించనుంది. భూమిపై గల జీవకోటి మనుగడకు కారణమైన భానుడి గూర్చి సమాచారం సేకరించేందుకు ఈ ప్రయోగం సహాయపడనుంది. ఈ ప్రయోగం కోసం నేడు మధ్నాహ్నమే కౌంట్​డౌన్​ ప్రారంభమైంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.