ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనసేన, టీడీపీ రైతు గర్జన - పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ - విజయనగరంలో రైతు జనగర్జన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 5:46 PM IST
Irrigation Problems in Vizianagaram District : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆర్థికంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పలుచోట్ల జనసేన, టీడీపీ నేతలు రైతు గర్జన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా కోరుకొండలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. మొక్కుబడిగా 103 కరవు మండలాలు మాత్రమే ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకొందని ఆరోపించారు. అనకాపల్లి జిల్లాలోని నాతవరం, గొలుగొండ మండలాల్లోని ఎండిపోయిన వరి పొలాల్లో జనసేన నాయకులు పర్యటించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా కనీసం సాగునీరు అందించలేని పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందని విమర్శించారు. అనంతరం నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
TDP, JSP Leaders Fire on YSRCP Governmenr on Farmers Problems : ఈ సందర్భంగా ఆ గ్రామ రైతులు తమ బాధను తెలియజేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టతున్నాయని వాపోయారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఐవీపీ రాజు మాట్లాడుతూ.. ఒక్కో ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశారని, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.