Govindaraja Swamy Temple: బంగారు తాపడంలో అక్రమాలు: హిందూ సంఘాల ఆరోపణ - ఆలయ బంగారు తాపడంలో ఇతర మతస్థులు
🎬 Watch Now: Feature Video
తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయ గోపురం బంగారు తాపడంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని హిందూ సంఘాల ఐక్య వేదిక నేతలు ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హిందూ జనశక్తి అధ్యక్షుడు లలిత్ కుమార్ పలు విమర్శలు చేశారు. తిరుపతిలోని అనేక దేవాలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవస్థానం గోవిందరాజస్వామి ఆలయమని ఆయన అన్నారు. సర్ణకారులైన హిందువులతో చేయించాల్సిన బంగారు తాపడం పని అన్యమతస్థులతో చేయిన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ గోపురం బంగారు తాపడానికి వినియోగించాల్సిన బంగారంలో 50 కిలోలు పక్కదారి పట్టిందన్నారని, బంగారం పక్కదారి పక్కదారి పట్టడానికి కాంట్రాక్టర్ పాత్ర ప్రధానంగా ఉందని లలిత్ కుమార్ అన్నారు. బంగారు పూత పనులు సరిగ్గా చేయకుండా లక్కను అంటించి బంగారు రంగు పూత పూస్తున్నారని ఆరోపించారు. బంగారు తాపడం పనుల్లో జరుగుతున్న అక్రమాలపై ఆధారాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందజేశామని తెలిపారు. టీటీడీ అధికారులు స్పందించి బంగారు తాపడం పనుల్లో అక్రమాలపై నిజ నిర్ధరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హిందూ సంఘాలతో కలిపి నిజ నిర్ధరణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ స్పందించకపోతే ఉద్యమం చేస్తామని ఆయన ప్రకటించారు.