సీఎం జగన్ చూపించని అప్పులు రాష్ట్రానికి చాలానే ఉన్నాయి: ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు ఎస్.అనంత్ - ఆర్థిక నిపుణుడు ఎస్ ఆనంద్ ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 10:00 AM IST
Interview With Finance Expert S Anand on AP Debts : రాష్ట్రంలో చూపించని అప్పులు ఇంకా చాలా ఉన్నాయని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు ఎస్.అనంత్ అంటున్నారు. చూపించని అప్పులు రాష్ట్రానికి చాలా ఉన్నాయనే ఆయన విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సర్కార్ వచ్చే నాటికి రాష్ట్రానికి 2.25లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్రమక్రమంగా అప్పులను ఇంకా పెంచిందని ఆయన ఆరోపించారు. అప్పు చేసి పప్పు కూడు ఎక్కువ కాలం సాగదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Debts Increasing in Andhra Pradesh Under CM Jagan Ruling : గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు లక్ష కోట్ల రూపాయలు అప్పులు పెరిగాయని ఎస్.అనంత్ తెలిపారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయని ఆయన అంటున్నారు. కొత్త ఆస్తులను సృష్టించడంపై దృష్టి సారించని ప్రభుత్వం.. ఉద్యోగాల కల్పన, అభివృద్ధిపైనా కూడా నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. సీఎం చెబుతున్న అభివృద్ధికి, వాస్తవ అభివృద్ధికి మధ్య చాలా తేడా ఉంటుందంటున్న ఎస్.అనంత్‌తో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి.