Indrakeeladri Durga Temple New EO Appoint Orders: దుర్గగుడి ఈవోగా కేఎస్ రామారావు.. తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వులు - indrakeeladri Durga Temple
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 5:28 PM IST
Indrakeeladri Durga Temple New EO Appoint Orders: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో దుర్గగుడి ఈవోగా కేఎస్ రామారావు నియమితులయ్యారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఆర్డీవోగా పనిచేస్తున్న రామారావును.. దుర్గ గుడి ఈవోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆయన బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దుర్గగుడి ఈవో భ్రమరాంబను అక్టోబరు 1న రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఎం. శ్రీనివాస్‌ను నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
దుర్గగుడి ఈవోగా.. శ్రీనివాస్ విధుల్లో చేరకపోవడంతో తాజాగా కేఎస్ రామారావును నియమించింది. కాగా, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో జరగాల్సి ఉండగా.. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ ఈవో భ్రమరాంబ బదిలీ చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆలయ ఛైర్మన్ కర్నాటి రాంబాబు.. దుర్గగుడి ఈవో భ్రమరాంబ బదిలీకి కొద్ది నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేశారనే వార్తలు కూడా వచ్చాయి.