Indian Oil Corporation Drivers Protest : పార్కింగ్ పంచాయితీ.. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్‌పై హోటల్ యజమాని దాడి - ap politics latest
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 3:56 PM IST
Indian Oil Corporation Drivers Protest : అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కన దొడ్డి గ్రామ సమీపంలోని ఐఓసీ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) డిపో వద్ద ఆయిల్ ట్యాంకర్ పార్కింగ్ విషయం హోటల్ నిర్వాహకుడు, ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో హోటల్ నిర్వాహకుడు రవి ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ పై దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ తోపాటు క్లీనర్ కు గాయాలయ్యాయి. అయితే అక్కడే ఉన్న తోటి ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఐఓసీ డిపో ఎదుట ఆందోళన చేశారు.
బాధిత ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు మాట్లాడుతూ.. ఐఓసీ అధికారులు డ్రైవర్, క్లీనర్లకు మౌలిక వసతులు కల్పించాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవరించటం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయిల్ ట్యాంకర్లకు పార్కింగ్ స్థలంతో పాటు డ్రైవర్, క్లీనర్లకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.