Godavari Floods: గోదావరికి పెరుగుతున్న వరద ప్రవాహం.. పాపికొండల విహారయాత్ర నిలిపివేత - Increasing Floods to Godavari in AP
🎬 Watch Now: Feature Video
Increasing Floods to Godavari at Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తమవుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. వరద ప్రవాహం పెరగటంతో అధికారులు అప్రమమత్తమయ్యారు. గత ఏడాది ఇదే సమయంలో కూనవరం, చింతూరు, దేవీపట్నం మండలాల్లోని గ్రామాలు గోదావరి నదికి వరదలకు.. నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు దేవిపట్నంలోని గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు బయల్దేరే బోట్లను నిలిపివేశారు. అంతేకాకుండా పాపికొండల విహారయాత్రలను సైతం నిలిపివేశారు. గండిపోచమ్మ ఆలయంలోకి కూడా ప్రస్తుతం వరదనీరు చేరుతోంది. దీంతో దర్శనాలకు ఎవరూ రావద్దని అధికారులు భక్తులకు సూచించటమే కాకుండా దర్శనాలను నిలిపివేశారు. రంపచోడవరం రెవెన్యూ అధికారులు వరదపరిస్థితులను సమీక్షిస్తున్నారు. వర్షాలకు తరచూ పోచమ్మగుడి ముంపునకు గురవుతోందని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.