Idupulapaya IIIT Student Suicide: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం.. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య - ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2023, 10:41 PM IST
Idupulapaya IIIT Student Suicide: కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న గంగారాం అనే విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థులు, అతని స్నేహితులు దుఃఖంలో మునిగిపోయారు. హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న విషయాన్ని తోటి స్నేహితులు చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన హాస్టల్ గది వద్దకు చేరుకున్న ట్రిపుల్ ఐటీ అధికారులు.. విద్యార్థి గంగారాం మృతదేహాన్ని కిందకు దించి అంబులెన్స్‌లో స్థానిక వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థి పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం తెర్నాంపల్లికి చెందిన విద్యార్థిగా అధికారులు తెలిపారు. విద్యార్థి గంగారాం మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. గంగారాం స్వగ్రామంలో సైతం విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి మృతదేహాన్ని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణితో పాటు.. ఓఎస్డీ గంగిరెడ్డి, ఇతరు అధ్యాపకులు పరిశీలించారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.