IAS Wives Association Plants Distribution: ఐఏఎస్ ఆఫీసర్స్ వైవ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ - ntr district Plants Distribution video
🎬 Watch Now: Feature Video
IAS Wives Association Plants Distribution: పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా మొక్కలను నాటడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. ఇదీ రీతిలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ఐఏఎస్ ఆఫీసర్స్ వైవ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.96 లక్షలకు పైగా మొక్కల్ని నాటించేందుకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 2,22,222 మొక్కల్ని నాటి బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలోనూ, 2 లక్షల మొక్కల్ని నాటి చిత్తూరు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచాయని అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మప్రియ అన్నారు. అధ్యక్షురాలు పద్మప్రియా జవహర్ రెడ్డి సూచనలు, సలహాల మేరకు.. మామిడి, కొబ్బరి, నేరేడు, చింత, జామ, సీతాఫలం, రావి, వేప, మారేడు, గానుగ వంటి మొక్కల్ని పంపిణీ చేసి నాటించారు. విజయవాడలో మధురానగర్, బుడమేరు గట్లపై వంద మొక్కల్ని, ప్రభుత్వ సిద్ధార్థ్ వైద్య కళాశాల ఆవరణలో 50 మొక్కల్ని నాటించి పర్యావరణ పరిరక్షణలో తమ వంతు కర్తవ్యాన్ని చాటుకున్నారు.