Huge Teak Fish Caught: వాడరేవు తీరంలో మత్స్యకారుడి వలకు చిక్కిన భారీ టేకు చేప - వాడరేవులో పట్టుకున్న పెద్ద టేకు చేప మత్స్యకారులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2023, 2:09 PM IST
Huge Teak Fish Caught: భారీ చేప వలకు చిక్కింది అనుకున్న ఆ మత్స్యకారుడి సంతోషం ఎక్కువ సమయం ఉండలేదు. ఆ చేపను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తక్కువ మొత్తానికే అమ్మడంతో నిరాశ వ్యక్తం చేశాడు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రంలో గోవింద్ అనే మత్స్యకారుడి వలలో భారీ టేకు చేప పడింది. వారం రోజుల క్రితం వేటకు వెళ్లిన మత్స్యకారుడు.. భారీ చేప వలకు చిక్కటంతో సంతోషంగా తీరానికి తీసుకువచ్చాడు. 6 అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో టేకు చేప వలలో పడింది. దాని బరువు సుమారు టన్ను ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. దీంతో అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని ఆ మత్స్యకారుడు అనుకున్నాడు. కానీ తక్కువ డబ్బులకు చేప అమ్మాల్సి రావటంతో నిరాశకు గురయ్యాడు. అరుదుగా దొరికే ఈ చేపకు కేరళలో మంచి గిరాకీ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ టేకు చేపలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయని.. అన్ని సీజన్లలో రావని చెప్పారు.