గుంటూరులో భారీగా పోలీసు బలగాలు మోహరింపు - భారీగా సిద్ధం కావటంతో వ్యక్తమవుతున్న అనుమానాలు - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 10:37 PM IST
Huge Police Force Deployment at Guntur Police Ground: గుంటూరు పోలీస్ మైదానంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మంగళగిరితో పాటు.. కర్నూలు, కాకినాడ, నెల్లూరు ఏపీఎస్పీ బెటాలియన్‌ల నుంచి వందలాది మంది పోలీసులు తరలివచ్చారు. తెలంగాణ ఎన్నికలకు పోలీస్ బలగాలు అవసరమైతే పంపడం కోసం సిద్ధంగా ఉంచినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాష్ట్రంలోని 2వేల మంది పోలీసులు తెలంగాణ ఎన్నికల కోసం తరలివెళ్లారు. ఇప్పుడు మళ్లీ వందలాది మంది సిద్ధం కావటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇంతమంది పోలీసులు రావటంతో ఎవరినైనా అరెస్టు చేస్తారా లేక ఏదైనా సంస్థను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే పుకార్లు బయలుదేరాయి. వాటిని గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఖండించారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు వెంటనే తరలివెళ్లటానికి వీలుగా బలగాలను సిద్ధంగా ఉంచినట్లు స్పష్టం చేశారు. ఏవైనా ఘర్షణలు జరిగితే పొరుగు రాష్ట్రాల నుంచి బలగాలు వెళ్లటం మామూలేనని.. ఇదే క్రమంలో బలగాల్ని రప్పించినట్లు వివరించారు. గుంటూరులో రేంజ్ కార్యాలయం ఉంది కాబట్టి అందరినీ ఇక్కడికే పిలిపించామన్నారు.