Home Appliances Burned with High voltage హైవోల్టేజ్తో తగలబడిన టీవీలు, ఫ్రిజ్లు ఇతర గృహోపకరణాలు.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బాధితుల మండిపాటు - Appliances Damaged due to High Voltage
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 8:02 PM IST
Electronic Appliances Damaged due to High Voltage: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తమకు లక్షలాది రూపాయలు నష్టం జరిగిందని అనంతపురం జిల్లాలోని బాధితులు వాపోతున్నారు. తమకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 27వ వార్డు ఆత్మకూరు వీధిలో ఈ రోజు ఒక్కసారిగా విద్యుత్తు హై వోల్టేజ్ వచ్చింది. దీంతో పలువురికి భారీగా నష్టం జరిగింది. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాటు ఒక్కసారిగా హై వోల్టేజ్ వచ్చింది.
దీని కారణంగా ఇళ్లల్లో ఉన్న ఫ్రిజ్లు, టీవీలతో పాటు తాగునీటి మోటార్లు, ఆ సమయంలో ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్ ఫోన్లు కాలిపోయినట్లు కాలనీ వాసులు తెలిపారు. దాదాపు 20 ఇళ్లలో వస్తువులు కాలిపోయాయి. విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే లక్షలాది రూపాయలు విలువ చేసే వస్తువులు దగ్ధమయ్యాయంటూ బాధితులు వాపోయారు. సంబంధిత విద్యుత్తు అధికారులు తమకు నష్ట పరిహారం ఇవ్వాలని బాధిత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
TAGGED:
High voltage damages