పత్తికొండలో తీవ్ర ఉద్రిక్తత - మంత్రి బుగ్గనకు అంగన్వాడీల వినతిపత్రం - ఏపీ రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 5:42 PM IST
High Tension in Pattikonda: కర్నూలు జిల్లా పత్తికొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంగన్వాడీలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న అంగన్వాడీలు మంత్రిని కలిసేందుకు వెళుతుండగా భారీగా పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అంగన్వాడీల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట(Clash between Anganwadis and Police) చోటుచేసుకుంది.
Anganwadi Workers Meet Minister Buggana: పెద్దఎత్తున తరలి వచ్చిన అంగన్వాడీలు పోలీసులను ఛేదించుకుని ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి బుగ్గన బయటకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. కాగా తమ సమస్యలను పరిష్కరించమని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక దీక్ష తొమ్మిదోరోజు కొనసాగుతోంది. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్వాడీలు డిమాండ్(Anganwadis Demands) చేశారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచకపోతే ఆందోళన(Anganwadi Workers Protest) మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.