ప్రభుత్వ కార్యాలయాలను ఇప్పటికిప్పుడే తరలించడం లేదు - హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది - New Capital Of Andhra Pradesh
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 12, 2023, 7:03 PM IST
High Court Postpones on Capital Shift Petition : విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు నిలిపివేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారని రాజధాని పరిరక్షణ సమితి పిటిషన్ వేసింది. కార్యాలయాలను ఇప్పటికిప్పుడే తరలించడం లేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని కోరుతూ రిజిస్ట్రీలో అప్లికేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అందువల్ల విచారణను సోమవారానికి వాయిదా వేయాలని విన్నవించారు. ఈ మేరకు పిటిషన్‌పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
అయితే రాజధాని తరలింపు విషయంలో విశాఖలో ముఖ్యమంత్రి విడిది, కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడం. అలాగే రిషికొండ తవ్వకాలపై కోర్టు కేసులతో తరలింపు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో జూన్, జులైలలో తరలించాలనుకున్నా సాధ్యం కాలేదు. చివరకు దసరా నాటికి ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం నుంచి రాజధాని కార్యకలాపాలు జరుగుతాయని సీఎం స్వయంగా పలు సందర్భాల్లో ప్రకటించారు. విశాఖలో ప్రభుత్వ కార్యలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాల ఎంపిక కోసం కమిటీని కూడా నియమించారు. ఇందులో మిలినియం టవర్స్‌ను ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు.