అమరావతి ఇన్నర్​ రింగ్​ రోడ్డు కేసు - చంద్రబాబు బెయిల్ పిటిషన్​పై విచారణ వాయిదా - Chandrababu anticipatory bail

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 9:14 PM IST

High Court Adjourned Hearing on Chandrababu Bail Petition: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. సీఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. వాదనలు కొనసాగింపునకు ఈ నెల 6వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్​పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. 

మరోవైపు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడి గతంలో దాఖలు చేసిన పీటీ వారెంట్ పిటిషన్​ను నేడు మరోసారి విచారణ జరిపింది. తదుపరి విచారణ ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారణ జరిపి డిసెంబరు 12వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.