కడప పెద్ద దర్గాను సందర్శించిన నేచురల్‌ స్టార్‌ నాని - ఘనంగా స్వాగతం పలికిన నిర్వాహకులు - natural star nani Visited Kadapa Dargah

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 10:55 AM IST

Hero Nani Visited Kadapa Ameen Peer Dargah: త్వరలో విడుదల కానున్న 'హాయ్ నాన్న' సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని నేచురల్ స్టార్‌ నాని కోరారు. కడపలో ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గాను నటుడు నాని సందర్శించారు. నిర్వాహకులు ముస్లిం సంప్రదాయంలో నానికి స్వాగతం పలికారు. దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి విశిష్టత గురించి నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా నాని విజయదుర్గాదేవి ఆలయాన్ని సందర్శించారు. హీరో నానిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దర్గాను సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని నటుడు నాని తెలిపారు.

ఇకపోతే నేచురల్​ స్టార్ నాని లీడ్​ రోల్​లో నటిస్తున్న 'హాయ్​ నాన్న' సినిమా డిసెంబరు 7వ తేదీన పాన్​ ఇండియా లెవెల్​లో విడుదల కానుంది. ఇందులో నానికి జోడీగా మృణాల్​ ఠాకూర్ సందడి చేయనున్నారు. బేబి కియార నానికి కుమార్తెగా నడిస్తోంది. తండ్రీ కుమార్తెల మధ్య నడిచే 'హాయ్‌ నాన్న' మూవీ అందరి మనసులో నిలిచిపోయేలా ఉంటుందని నాని తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.