Hearing on Bhaskar Reddy Interim Bail Petition: సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్‌రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్..నేడు విచారణ - సీబీఐ కోర్టులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 15, 2023, 9:52 AM IST
Hearing on Bhaskar Reddy Interim Bail Petition in Viveka Murder Case in CBI Court : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ నిరాకరిస్తూ ఈ నెల 4న తెలంగాణ హైకోర్టు తీర్పును ఇచ్చింది. దీంతో భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో మరో పిటిషన్ వేశారు. అనారోగ్య సమస్యల దృష్ట్యా 15 రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. భాస్కర్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేయాలని కోరుతూ సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహిత బంధువని.. బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. ఇటీవల హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై సీబీఐ గట్టిగా వ్యతిరేకించింది. భాస్కర్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.