Har Ghar Tiranga Rally in Visakhapatnam: విశాఖలో 'హర్ ఘర్ తిరంగా'.. తపాలా శాఖ ఉద్యోగుల ర్యాలీ - 15 august 2003
🎬 Watch Now: Feature Video

Har Ghar Tiranga Rally in Visakhapatnam : క్యాలండర్‌లో ఆగస్టు అంటే గుర్తొచ్చేది జెండా పండుగ. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.. విశాఖ బీచ్ రోడ్లో 'హర్ ఘర్ తిరంగా' పేరుతో రాష్ట్ర తపాలా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. బీచ్ రోడ్ కాళీ మాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర తపాలా చీఫ్ పోస్ట్ మాస్టర్ వి. రాములు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జాతీయ జెండాలతో పోస్టల్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వి. రాములు మాట్లాడుతూ ..కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా 2.0 పేరిట ఇచ్చిన పిలుపు మేరకు.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై, కార్యాలయాలపై జాతీయ జెండాలను ఎగురవేసి.. జాతి సమైక్యతను చాటి చెప్పాలని అన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని తపాలా శాఖల్లో 25 రూపాయలకే జాతీయ జెండాలు విక్రయించనున్నామని ఆయన తెలిపారు..