Gurukula Supervisors Agitation: విజయవాడలో గురుకుల పాఠశాలల సూపర్​వైజర్ల ధర్నా

By

Published : Jun 19, 2023, 2:51 PM IST

thumbnail

Gurukula Schools Supervisors Agitation: గురుకుల పాఠశాలలో పని చేస్తున్న సూపర్​​వైజర్లను తొలగిస్తూ గురుకుల పాఠశాలల సెక్రటరీ విడుదల ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని.. గురుకుల పాఠశాలల సూపర్​​వైజర్ల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా ఉన్న ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో.. సుపర్​వైజర్లు పాల్గొన్నారు. తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గురుకుల పాఠశాల సూపర్​ వైజర్లను ఆప్కాస్​లోకి వీలినం చేయాలని కోరారు. వీలినం చేస్తారని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఒక్క సంతకంతో తమ కుటుంబాలను రోడ్డుపై పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. పెండింగ్​లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి క్యాజువల్​ లీవ్స్​, మెడికల్​ లీవ్స్​ వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని.. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.