'భూమి హక్కు చట్టం రద్దు చేయాలి' అధికారం కొత్త వ్యవస్థ చేతుల్లోకి వెళ్తుంది : న్యాయవాదుల ఆందోళన - గుంటూరు కోర్టు బార్ అసోషియేషన్ న్యాయవాదులు ఆందోళన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 3:17 PM IST

Guntur District Court Lawyers Against to  Land Act- 2023 : భూమి హక్కు చట్టం- 2023 ను వెంటనే రద్దు చేయాలంటూ గుంటూరు జిల్లా కోర్టు వద్ద బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. భూమి యాజమాన్య హక్కును నిర్దేశించే అధికారం న్యాయ స్థానాలకు కాదని కొత్త వ్యవస్థ చేతుల్లో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని న్యాయవాదులు ఆరోపించారు. చట్టం రూపొందించే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని సీనియర్​ న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రభుత్వం చెబుతున్న అప్పిలేట్ అథారిటి ఎవరనేది చట్టంలో స్పష్టంగా నిర్వర్తించకపోవటం అనుమానాలకు తావిస్తోందన్నారు. 

Guntur District Court Lawyers Protest : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని గుంటూరు బార్ అసోషియేషన్ అధ్యక్షుడు, సీనియర్​ న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ చట్టంలో చాలా తప్పులు ఉన్నాయని గుంటూరు జిల్లా కోర్టు వద్ద ఆందోళనలో న్యాయవాదులు తెలిపారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఆస్తులు తమవే అని నిరూపించుకోవడం కూడా ఇబ్బంది కరంగా మారుతుందని లాయర్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.