Goddess decorated with 600 KG Silver శరన్నవ ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లాలో 600 కేజీల వెండితో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ..
🎬 Watch Now: Feature Video
Goddess decorated with 600 KG Silver దసరా ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతవరణాన్ని తీసుకు వచ్చాయి. అందులో భాగంగా ఓ కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని ఆరు వందల కేజీల వెండితో అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని బంగారు తాపడంతో అలంకరణ చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Dussehra Celebrations in AP : నెల్లూరు జిల్లాలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని రాజరాజేశ్వరీ ఆలయం, జొన్నవాడ కామాక్షితాయి, ఇరుకళల పరమేశ్వరి ఆలయాల్లో వైభవంగా ఉత్సవాలు చేస్తున్నారు. అందులో భాగంగా స్టోన్ హౌస్ పేటలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని అర్చకులు బంగారు తాపడంతో అలంకరణ చేశారు. కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని ఆరు వందల కేజీల వెండితో అలంకరించారు. వెండి పట్టీలు, గాజులతో అమ్మవారి లోపలి గర్బగుడిని సుందరంగా తయారు చేశారు. బంగారు, వెండితో నిండిపోయిన అమ్మవారిని చూడటానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.