'ఇరిగేషన్‌పై సదస్సు నిర్వహించి సాగునీటి రంగాన్ని జగన్ అవమానపరిచారు' - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 2, 2023, 3:48 PM IST
Ganta Srinivasa Rao Allegations on Jagan: విశాఖలో ఇరిగేషన్‌పై సదస్సు నిర్వహించి ముఖ్యమంత్రి జగన్ సాగునీటి రంగాన్ని అవమానపరిచారని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత గంటా శ్రీనివాసరావు విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారని ఆక్షేపించారు. రాష్ట్రంలో తీవ్ర కరవు తాండవిస్తున్నా రైతులను ఆదుకునే చర్యలేవీ చేపట్టలేదని దుయ్యబట్టారు. మద్యపాన నిషేధమంటూ జగన్ అధికారంలోకి వచ్చారు.. కానీ రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల 35 లక్షలమంది అనారోగ్యం పాలయ్యారని విమర్శించారు. చంద్రబాబు బయటకు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు స్పందన చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు.. నిజమైన నాయకుడికి ఘనస్వాగతం లభించిందని అన్నారు.
Palla Srinivasa Rao Allegations on Jagan: అధికారంలోకి వచ్చీ రాగనే ప్రజావేదికను కూల్చేసిన సీఎం జగన్.. రుషికొండపై నిర్మాణాల మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన నాయకులు.. చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయన కటౌట్‌కి పాలతో అభిషేకం నిర్వహించారు.