Gannavaram YCP leader Yarlagadda meet with Party Activists: వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తా: యార్లగడ్డ వెంకట్రావు - andhra pradesh news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-08-2023/640-480-19259833-479-19259833-1691978236093.jpg)
Gannavaram YCP leader Yarlagadda meet with Party Activists : కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయం రసవత్తరంగా మారుతోంది. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు ఏ మాత్రం పడని వేళ.. వర్గ పోరు కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తన వర్గానికి చెందిన అనుచరులతో ఆయన గన్నవరం శివారులోని ఓ కన్వెన్షన్ హాల్లో వైసీపీ కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ గన్నవరం నుంచే పోటీ చేస్తానని యార్లగడ్డ స్పష్టం చేశారు. ఈ తరుణంలో కార్యకర్తలు, నేతలతో యార్లగడ్డ సమావేశం ఏర్పాటు చేయడంపై ఉత్కంఠ నెలకొంది. కార్యకర్తల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎలాంటి పరిణామాలు జరిగిన గన్నవరం నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు యార్లగడ్డ పునరుద్ఘాటించారు.. అనివార్య కారణాలతోనే 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గ కార్యకర్తలకు దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేస్తానని వెంకట్రావు స్పష్టం చేశారు.