సినీ ఫక్కీలో గంజాయి తరలింపు - విజయవాడలో 2కోట్ల విలువైన సరకు పట్టివేత - ganja Trafficking from Visakha to other states
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 11:02 PM IST
Ganja Seized in Vijayawada: విజయవాడలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. దాని విలువ సుమారు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధికారులు ఎన్ని వ్యుహాలు పన్నీ.. అక్రమార్కుల గుట్టు రట్టు చేస్తున్నా.. గంజాయి ముఠాలు మాత్రం అక్రమ రవాణాను మానుకోవడం లేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ దొంగ మార్గాల్లో మత్తు పదార్థాలను తరలిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం విజయవాడలో పట్టుబడిన అక్రమ రవాణే అందుకు ఉదాహరణగా నిలస్తోంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా అవుతోందని డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో అధికారులు విజయవాడలో తనిఖీలు నిర్వహించగా.. 731 కిలోల గంజాయిని పట్టుకున్నారు. భారీ స్థాయిలో గంజాయిని తరలించడానికి లారీలో.. ప్రత్యేకంగా ఓ అల్మారా రూపంలో ఏర్పాటు చేశారు. ఎవరికి అనుమానం రాకుండా చేసిన ఈ ఏర్పాటు గుట్టును అధికారులు ఛేదించారు. పట్టుబడిన గంజాయిని, లారీని, పోలీసులు స్వాధీనం చేసుకుని.. డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి విలువ దాదాపు 2.19కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.