Four Police Officers to VR: ఓటరు జాబితా సవరణలో జోక్యం.. నలుగురు పోలీసు అధికారులపై చర్యలు - Women Police

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2023, 8:07 AM IST

Police Higher Officials Sends Four Officers to VR: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో మార్టూరు సీఐ ఫిరోజ్, ఎస్సై కమలాకర్, పర్చూరు ఎస్సై ప్రసాద్, గతంలో యద్దనపూడి ఎస్సైగా పనిచేసిన అనూక్‌ను వీఆర్‌(వేకెన్సీ రిజర్వ్)కు (Four Police Officers to VR)  పంపుతూ.. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫారం-7 దరఖాస్తుల(Form-7) సమాచారాన్ని తీసుకోవడమే కాకుండా.. బీఎల్వోలుగా ఉన్న మహిళా పోలీసులతో(Women Police) వాట్సాప్ గ్రూప్‌ను(Whatsapp Group) ఏర్పాటు చేసి నేరుగా జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఐ, ఎస్‌ఐలు బూత్ లెవల్ ఆఫీసర్లుగా ఉన్న వారితో వాట్సప్ ద్వారా సంభాషిస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు వెళ్లడైంది. 

పర్చూరు తెలుగుదేశం నేత ఏలూరు సాంబశివరావు.. ఈ విషయమై ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఎన్నికల అధికారులు.. జిల్లా కలెక్టర్​కు నివేదిక పంపారు. ఫారం- 7 విషయమై సదరు పోలీస్ అధికారులు.. బీఎల్ఓలపై(BLO) ఒత్తిడి తెచ్చినట్లు విచారణలో తేలింది. అంతే కాకుండా అక్రమ గ్రానైట్, గ్రావెల్ తరలింపుల (Illegal Granite and Gravel Trafficking) విషయంలో కూడా ఈ పోలీస్ అధికారులపై పలు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఐ, ఎస్ఐలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.