Former Vice President Venkaiah Naidu's speech యువతే ఈ దేశ భవిష్యత్తు!.. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో వెంకయ్య నాయుడు
🎬 Watch Now: Feature Video
Former Vice President Venkaiah Naidu's speech: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఉన్న మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో 12వ పట్టభద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ లో 12వ పట్టభద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై విద్యార్థులకు పట్టాలు అందించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎదుగుదలకు మూల కారకులైన తల్లిదండ్రులు, గురువులు, స్వగ్రామాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పారు. ఏ దేశం, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఇతర భాషలు మాట్లాడినా తప్పు లేదు కానీ, మాతృభాష తెలుగుకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను ఎన్నటికీ వీడరాదని ఇతర దేశాలలో సభలకు వెళ్లినపుడు మన తెలుగువారు కట్టు, బొట్టు సంప్రదాయ పద్ధతిలో రావడం ఎంతో హర్షించదగ్గ విషయమని చెప్తూ.. వారిని చూసి ఎంతో గర్వపడ్డానని అన్నారు. డిగ్రీలు పొంది ఇతర దేశాలలో ఉద్యోగాలు చేస్తూ అక్కడ మన దేశ గొప్పతనాన్ని చాటాలని అన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ ఇప్పుడున్న రాజకీయ నాయకుల భాషా పద్ధతి సరిగా లేదని, అసెంబ్లీలోనే పద్ధతి లేకుండా మాట్లాడడం సబబు కాదని అన్నారు. ప్రకృతిని నాశనం చేయడం పద్ధతి కాదని, చెట్లను నరకడం, గుట్టలను చదును చేయడం వల్ల మనకే నష్టమని హితవుపలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ దేశ భవిష్యత్తు యువతి యువకులే అని, మోహన్ బాబు యూనివర్సిటీలో అన్ని రకాల సౌకర్యాలతో చదువులు నేర్పుతున్నారని పేర్కొన్నారు.