TDP Sravan Kumar Interview On R5 zone: 'వైసీపీ కార్యకర్తలకు రాజకీయ లబ్ధి చేకూర్చే కుట్రలో భాగంగానే R5జోన్ ఏర్పాటు' - ఆర్5 జోన్‌పై శ్రావణ్ కుమార్ వ్యాఖ్యలు న్యూస్
🎬 Watch Now: Feature Video

TDP Sravan Kumar Interview On R5 zone: పేదల ముసుగులో వైసీపీ కార్యకర్తలకు రాజకీయ లబ్ధి చేకూర్చే కుట్రలో భాగంగానే R-5 జోన్ ఏర్పాటు చేశారని.. తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. ఆర్-5 జోన్‌తో భారతదేశంలోనే అతిపెద్ద మురికివాడ ఏర్పాటు కానుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను విశాఖ వెళ్లి పోతానంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. అమరావతి ప్రాంతంలో భూములిచ్చి ఏమి లాభమని శ్రావణ్ కుమార్ నిలదీశారు. టీడీపీ హయాంలో పేదలకు కేటాయించిన రెండున్నర సెంట్ల భూమిని కాదని.. సెంటు భూమిని ఇచ్చి పేదల్ని సీఎం మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్-3 జోన్‌లో పేదల కోసం 2,500 ఎకరాలు కేటాంచామని ఆయన తెలిపారు. 400 ఎకరాల్లో 5,024 టిడ్కో గృహాలు నిర్మించినట్లు శ్రావణ్ కుమార్ చెప్పారు. నాలుగేళ్లయినా వాటిని ఇప్పటి వరకూ పంపిణీ చేయలేదంటూ ఆయన మండిపడ్డారు. రాజధానిలోని స్థానికేతరులకు ఇళ్ల పట్టాల పంపిణీ, సీఎం వ్యాఖ్యలపై తెనాలి శ్రావణ్ కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖీ.