Former TDP MLA Varma protest డ్రైనేజీ మురుగును మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఎత్తి పడేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే!
🎬 Watch Now: Feature Video
Former MLA's innovative protest: మున్సిపల్ సిబ్బంది డ్రెయినేజీల్లో నెలల తరబడి మురుగు తొలగించకపోతే సామాన్య ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మున్సిపల్ సిబ్బందికి చెప్పి ఊరుకుంటారు. అప్పటికీ సమస్య పరిష్కరించకపోతే నిరసనకు దిగుతారు. కానీ ఓ మాజీ ఎమ్మెల్యే ఇదే విషయమై వినూత్నంగా నిరసన తెలిపారు. కానీ, పారిశుధ్యం పెద్ద సమస్యే కాదన్నట్లు.. కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆ వివరాలివీ.. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని గత పది రోజులుగా పారిశుధ్య పనులు చేయకపోవడంతో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ వినూత్న నిరసన చేపట్టారు. గ్రూప్ కాలంలో నిండిపోయిన పూడికను తీసుకువచ్చి మున్సిపల్ కార్యాలయం ముందు వేశారు. అనంతరం అక్కడ నిరసన వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది.. వర్మ తీరును నిరసిస్తూ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే వర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పిఠాపురంలోని ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.