భక్తుడి వినూత్న మొక్కులు.. అమ్మవారిపై హెలికాప్టర్‌తో పూల వర్షం - గుడుపల్లె ప్రసన్న రాళ్ల గంగమ్మ
🎬 Watch Now: Feature Video
Flower Shower from Helicopter: మనం కోరుకున్న కోర్కెలు తీరితే.. ఫలానా విధంగా మొక్కులు చెల్లించుకుంటాం అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అలాగే ఈ భక్తుడు కూడా అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాడు. కానీ అందరి కంటే చాలా వినూత్నంగా తన మొక్కు తీర్చుకున్నాడు. అది ఎలా అంటారా పూల వర్షం కురిపించాడు.
పూల వర్షంలో కొత్తేం ఉంది.. చాలా సార్లు చూశాం అంటారు కదా. మామూలుగా చేస్తే ఇందులో కొత్తేం ఉంటుంది. అందుకే ఆ భక్తుడు ఏకంగా హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించాడు. చిత్తూరు జిల్లా గుడుపల్లెలోని ప్రసన్న రాళ్ల గంగమ్మ అమ్మవారి రథంపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించాడు ఆ భక్తుడు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహదేవన్ అనే భక్తుడు హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించి.. రెండోసారి తన మొక్కు తీర్చుకున్నాడు. గుడుపల్లిలో ప్రసన్న రాళ్ల గంగమ్మ రథోత్సవం వైభవంగా జరిగింది. వార్షికోత్సవాల సందర్భంగా ప్రసన్న రాళ్ల గంగమ్మ అమ్మవారిని రథంపై ఊరేగించారు. రథోత్సవానికి కర్ణాటక తమిళనాడు సరిహద్దు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించటాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.