FIRE ACCIDENT IN APGENCO: నేలటూర్ జెన్‌కోలో అగ్నిప్రమాదం.. కన్వేయర్ బెల్ట్ దగ్ధం - fire accdients in ap
🎬 Watch Now: Feature Video
FIRE ACCIDENT IN APGENCO : నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్‌కోలో అగ్నిప్రమాదం జరిగింది. శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో రెండో యూనిట్‌కు బొగ్గు సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్‌పై మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేసే కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో కార్మికులు, ఉద్యోగులు తలో దిక్కున పరుగులు తీశారు. 45 అడుగుల ఎత్తులో కన్వేయర్ బెల్ట్‌పై మంటలు చెలరేగడంతో మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసేందుకు సిబ్బంది చర్యలు ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున మంటలు రావడంతో కృష్ణపట్నం పోర్టు నుంచి ఏపీ జెన్కోకు బొగ్గు సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్ దగ్ధమైనట్లు సమాచారం. సుమారు వంద మీటర్ల మేర కన్వేయర్ బెల్ట్ దగ్ధమైనట్లు తెలిసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జెన్‌కోలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. ఘటనపై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.