శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. తారాజువ్వ పడి పందిరి దగ్ధం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 30, 2023, 1:43 PM IST

Fire accident during SriRamaNavami celebrations: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వేడుకల్లో భాగంగా బాణసంచా కాలుస్తుండగా తారాజువ్వ పడి పందిరి కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. గ్రామోత్సవ ప్రారంభ సమయంలో బాణసంచా కాలుస్తుండగా తారాజువ్వ ఆలయ ప్రాంగణంలోని పందిరిపై పడింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పందిరి పూర్తిగా కాలిపోయింది. దీంతో ఉత్సవంలో పాల్గొనేందుకు తరలి వచ్చిన భక్తులు భయంతో పరుగులు తీశారు. కొంతమంది స్థానికులు, భక్తులు కలిసి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారు రూ.2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.