Fire Accident at Vizag Steel Plant SMS1 : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. నేలపాలైన ఉక్కుద్రవం.. కార్మికులు సేఫ్ - ఏపీ అగ్నిప్రమాదాల వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 6:51 PM IST
Fire Accident at Vizag Steel Plant SMS1 : విశాఖలోని గాజువాక స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్-1లో శుక్రవారం (సెప్టెంబర్) అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. ఎస్ఎంఎస్-1 లో ఉక్కు ద్రవం నేలపాలవటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు.
స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్-1లో(steel plant SMS1) ల్యాడిల్ లిఫ్ట్ చేస్తుండగా అకస్మాత్తుగా లాడిల్ నాజిల్‌కు రంధ్రం పడింది. దీంతో మరిగిన ఉక్కు ద్రవం కింది పడింది. మరిగిన ఉక్కు ద్రవాన్ని క్రేన్ సహాయంతో లాడిన్ను పైకి ఎత్తుతుండగా సేఫ్టీ పిన్ విరిగిపోయింది. ల్యాడిల్‌ను తీసుకు వెళ్తున్న కార్‌పై ఉక్కు ద్రవం పడి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం వల్ల ఏర్పడిన నష్టాన్ని ఉక్కు కర్మాగారం ఆర్థికశాఖ విభాగం (Finance department) వారు అంచనా వేస్తోంది.