Teachers unions రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీపీఎస్ కు ఉపాధ్యాయులు వ్యతిరేకం.. ఫ్యాఫ్టో - ఉపాధ్యాయ సంఘాల నిరసన కార్యక్రమాలు
🎬 Watch Now: Feature Video
Federation of teachers union: ఉపాధ్యాయులతో ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాఫ్టో) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లా కేంద్రాల్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించారు. ఈ సందర్బంగా కర్నూల్లో నిర్వహించి కార్యక్రమంలో ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు హృదయ రాజు పాల్గొన్నాడు. కర్నూలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సదస్సులో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడుతూ... జీవో నెంబర్ 117ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌కు బదులు జీపీఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందనీ.. ఉపాధ్యాయులు ఈవిధానాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. జీపీఎస్, ఓపీఎస్‌కు ప్రత్యమ్నాయం కాదన్నారు. 11వ పిఆర్సీలో ఎన్నో అసమానతలు ఉన్నాయని, అందువల్ల తాము నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 12వ పీఆర్సీకి అటువంటివి అసమానతలు లేకుండా చట్టబద్ధమైన పీఆర్సీ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.