ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొన్న మరో లారీ - అక్కడికక్కడే ఇద్దరు మృతి - AP accident news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 1:18 PM IST
Fatal Road Accident on Martur National Highway: బాపట్ల జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్టూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున రాయపూర్ నుంచి బైండింగ్ వైరు లోడుతో మధురై వెళ్తున్న లారీకి వెనుక టైరు పంచర్ అవడంతో లారీని రోడ్డు ప్రక్కన ఆపి డ్రైవర్ మరమ్మతులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో మరో లారీ వేగంగా వచ్చి ఆగివున్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మధురైకి చెందిన డ్రైవర్ రాజు, టంగుటూరుకు చెందిన మరో లారీ డ్రైవర్ మేడవరపు అజయ్ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక లారీ క్యాబిన్లో ఇరుక్కున్న అజయ్ శ్రీనివాస్ ను పోలీసులు, స్థానికులు అతికష్టం మీద బయటికి తీశారు. సమాచారం అందుకున్న మార్టూరు సీఐ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండ చర్యలు చేపట్టారు.