Farmers Protest In Mandapaka:'గోనెసంచులు ఇవ్వడంలేదు.. మొలకెత్తిన ధాన్యాన్ని కోనుగోలు చేయాలి' - మండపాక ఆర్బీకే ఎదుట రైతుల నిరసన
🎬 Watch Now: Feature Video
Farmers Protest In Front Of RBK : రైతు భరోసా కేంద్రంలో సంచులు ఇవ్వడం లేదంటూ పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతు భరోసా కేంద్రం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు.
మండపాక గ్రామ పరిధిలో ఆయకట్టుకు సుమారు 1,80,000 సంచులు అవసరం కాగా, ఇప్పటివరకు 90 వేల సంచులు మాత్రమే రైతులకు ఇచ్చారని మిగిలిన సంచులను వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయాలని రైతుల కోరారు. మిల్లులకు తరలించిన ధాన్యంలో నూక శాతం ఎక్కువగా ఉందని 10 నుంచి 20వేల రూపాయల వరకు మిల్లర్లు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని, అటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులకు డిమాండ్ చేశారు. నూక శాతం నిర్ధారించే యంత్రాన్ని కూడా రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసి ఎంత ధర తగ్గుతుందో తెలియజేస్తే ధాన్యాన్ని అమ్మాలో, వద్దో నిర్ణయించుకుంటాడని పేర్కొంన్నారు. రైతు భరోసా కేంద్రానికి సరఫరా చేసిన ధాన్యం మిల్లులకు వెళ్ళిన తర్వాత నూక శాతం ఎక్కువగా ఉందని మిల్లర్లు రైతులను డబ్బులు కట్టమని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు.